kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

unni krishnan & sunitha upadrashta - gunde gutiki كلمات الأغنية

Loading...

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ

నా ఇంట్లో దీపం పెడుతుందీ || 2 ||

నేలనోదిలిన గాలి పరుగున
ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను
వేగంగా చేయాలి

నా ఇంటి గడపకి మింటి మెరుపుల
తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి
స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో, ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

భావ మమతల భావ కవితలే
శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు
సుముహుర్తం రావాలి

మా, ఏడు అడుగుల జోడు నడకలు
ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని
అక్షింతలు వేయాలి

ఇన్నాళ్ళు, ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కల కల కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...