kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

pvr raja - dosthi كلمات الأغنية

Loading...

మబ్బు చీరపై లెక్కపెట్టవే చిట్టి బాల్యమా …
చందమామకే పిల్లలెందరో చెప్పి చూడమ్మా …
సబ్బు బిల్లతో బొమ్మ చెక్కవే పసిడి పాదమా …
నీ చిన్ని నవ్వుతో ప్రాణమియ్యవే బుల్లి రాగమా …
చేరి ఇసుకలో ఆటలాడుదామా …
కూడీ కోకిలై పాటపాడుదామా …
ఆపై కాగితం పడవలెక్కుదామా …
చుట్టి ఇంటికి దారి వెతుకుదామా …
చిన్ని నేస్తమా పక్షులై నింగికే ఎగిరొద్దామా …
వెన్నెలమ్మపై కళ్ళలో ఒత్తులే వెలిగిద్దామా….

చరణం 1
నువ్వు నేను ఓ‌ గట్టు, చేను
నువ్వు నేను టెర్రస్సు , రెయిను
నువ్బు నేను దోస్తీకి అర్ధం కామా

నువ్వు నేను రాకెట్టు, ప్లేను
నువ్వు నేను పెసరట్టు, జున్ను
నువ్వు నేను ఫ్రెండ్షిప్ లోనే బెస్టుఫ్రెండ్స్ కామా

ఈ ఎద్దుల బండెక్కి ఊరంత తిరిగొద్దామా
ఈ నాగిలితో దున్నేసి నవ్వులెన్నో పండిద్దామా
ఈ ఎద్దుల బండెక్కి ఊరంత తిరిగొద్దామా
ఈ నాగిలితో దున్నేసి నవ్వులెన్నో పండిద్దామా

దోస్తీ మన ఇద్దరి ఆస్తి
దోస్తి మనకే ఇక మస్తీ
దోస్తీ మనతో చేస్తుందే దోస్తి
దోస్తీ మన ఇద్దరి ఆస్తి
దోస్తి మనకే ఇక మస్తీ
దోస్తీ మనతో చేస్తుందే దోస్తి
చరణం 2
నువ్వు నేను కాగితం, పెన్ను
నువ్వు నేను ఐస్ క్రీము, కోను
నువ్వు నేను రెయిన్ బో ని తెచ్చి ఊయలూగుదామా

నువ్వు నేను లాకెట్టు , చైను
నువ్వు నేను చాక్లెట్టు , బన్ను
నువ్వు నేను చాలంటు అంతా తిరిగి చాటుదామా

మా‌‌ ఇంటి అరుగును ఎక్కి అష్టా చెమ్మ ఆట ఆడి
ఎవరు నెగ్గుతారో ఇపుడే చూసుకుందమా
మా‌‌ ఇంటి అరుగును ఎక్కి అష్టా చెమ్మ ఆటను ఆడి
నువ్వో నేనో నెగ్గేదెవరో చూసుకుందామా

దోస్తీ మన ఇద్దరి ఆస్తి
దోస్తి మనకే ఇక మస్తీ
దోస్తీ మనతో చేస్తుందే దోస్తి
దోస్తీ మన ఇద్దరి ఆస్తి
దోస్తి మనకే ఇక మస్తీ
దోస్తీ మనతో చేస్తుందే దోస్తి

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...