kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

p. susheela & s. p. balasubrahmanyam - cheepana كلمات الأغنية

Loading...

చెప్పనా… సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి
చెప్పనా. చెప్పనా… చెప్పనా…

అడగనా… నోరు తెరిచి అడగరానివి ఈ
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ ఈ
అడగనా… అడగనా… అడగనా…

చెప్పనా… సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా… నోరు తెరిచి అడగరానివి

చెప్పమనీ చెప్పకుంటే ఒప్పననీ
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా
అడగమనీ అడగకుంటే జగడమనీ
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా
అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి

చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

నిన్న రాత్రి వచ్చి సన్న దీప మార్పి
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే
పిల్ల గతి కన్నెపిల్ల గతి ఏమిటో చెప్పనా

పగటి వేళ వచ్చి పరాచకలాడి
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి
పెదవి చాపి పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే
ఇవ్వమనీ ఇచ్చి చూడమని ముద్దులే అడగనా
వద్దని హద్దు దాట వద్దనీ
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా

నేననీ వేరనేది లేదనీ అనీ అనీ ఆగమని
ఆపుతున్నదెందుకని అడగనా… ౯+
అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి
చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
అడగనా అడగనా అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

గానం: బాలు, సుశీల

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...