kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

hemachandra feat. divya - kanthi poola pandaga كلمات أغنية

Loading...

ప్రేమ చిటికెలు వేసే క్షణం
ప్రతి గుండె గల గల కోలాహలం
హాయి పిలుపులు తాకే క్షణం

ప్రతి రోజు మిల మిల బృందావనం
చీకట్లనే వది లించేయగా
సంతోషమే వెలుగై వాలగా
పెదవంచు ప్రమిదల్లోనవ్వు కిల కిల
కాంతి పూల పండగ
దీపావళి కంటి పాప నిండుగా
కాలమంత ఆగగా
ఆనంద కేలి గంతు లేసి ఆడగా
తారజువ్వల్లాగా ఈ మనసు ఎగిరెను ఇ వేళ
తారలు దివ్వెల్లాగా దగ దగ దారంత మెరిసెను చాలా
$$ music $$
హే ఊహాలోనే ఉండిపోతే వెళ్ళిపోదా జీవితం
చేతులారా అందుకుంటే
అంతులేని సంబరం
అరె ఏటు గాలి వీస్తుంటే అటు వైపుగ
వెళ్లి పోతే ఏముంది సరి కొత్తగ
అనుకున్న దారుల్లో అడుగేయగా
అసలైన గెలుపొచ్చి ముద్దాడదా
కాంతి పూల పండగ
దీపావళి కంటి పాప నిండుగా
హే కాలమంత ఆగగా
ఆనంద కేలి గంతు లేసి ఆడగా
అనురాగం అల్లరి చేసే
అనుబంధం చిందులు వేసే
సరదాలకు తలుపులు తీసెయ్
నడిరేయి కి రంగులు పూసే
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగ
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగ
హే చీకటేల దీపమల్లే వచ్చి పోవే వెన్నెల
తనుకులీలే సొగసుతోటి లాగుతావే నన్నిలా
నీలోని కలతలను చూడాలని నీ చెంత చేరాను కావాలని
ఆ వెన్న ముద్దల్లే వెలగాలని నీకిచ్చు కున్నాను నా మనసుని
హే కాంతి పూల పండగ
దీపావళి కంటి పాప నిండుగా
కాలమంత ఆగగా
ఆనంద కేలి గంతు లేసి ఆడగా
నీ చుట్టూ భూ చక్రంలా తిరిగానే నిజమా కాదా
విరజిమ్మే నవ్వులు చూస్తే ఏద గూటికి పున్నమి రాదా
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగ
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగ…

كلمات أغنية عشوائية

كلمات الأغنية الشائعة حالياً

Loading...