kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chinmayi - padahaarellainaa كلمات الأغنية

Loading...

పదహారేళ్లైనా పసి పాపై ఉన్నా
నీ వెచ్చని చూపే తగిలేదాకా
పరువంలో ఉన్నా పరవాలేదన్నా

నీ కల నా వైపే కదిలే దాకా
అరె ఏమైందో ఏమైందో సరిగా ఏమైందో
నే మొదట నిన్ను కలిసినాక నాలో ఏం జరిగిందో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంతా మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీలా మార్చిందయ్యో

తెలుగే కాకుండా చాలా భాషల్లోన
వెతికా ఈ జబ్బుని ఏమంటారో
తెలిపే వాళ్ళెవరూ లేరే ఈ లోకాన
నువ్వే చెప్పాలది నీవల్లేరో
ఎన్నో చేసి చేసి ఎంతో సన్నబడినా
బరువే తగ్గదు ఈ గుండెల్లోన
హయ్యో హయ్యో ఇది ఏం మాయో

అంటూ అంతా మారిందయ్యో

హయ్యో హయ్యో ఇది ఏం మాయో

నన్నే నీలా మార్చిందయ్యో

హో… చదువేం అవుతుందని గుబులైనా రాదేంటో
నిన్నే చదవాలను ఆరాటంలో…
రేపేమవుతుందని దిగులైనా రాదేంటో
నిన్నని మరిపించే ఆనందంలో
చుట్టూ ఉన్న వాళ్లు తిట్టే కన్న వాళ్లు
ఎవరూ గుర్తు రారు నీ తలపుల్లో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంతా మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీలా మార్చిందయ్యో

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...